విద్యార్థుల యూనిఫాం రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండేలా డిజైన్లలో వైవిధ్యం చూపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో విద్యార్థులకు యూనిఫాంలు, ఇతర సామగ్రి పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.