వైవిధ్యమైన గెటప్‌లతో ఆకట్టుకుంటున్న శర్వానంద్ జార్జ్ క్రిష్ బూస్టర్
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం జార్జ్ క్రిష్. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి దర్శకుని జన్మదినం సందర్భంగా ఫస్ట్ బూస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో శర్వానంద్ చర్చిలో ఫాదర్‌గా, మరోవైపు స్వామీజీగా భిన్నమైన గెటప్‌లలో కనిపించారు. మానస వారణాసి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.