ఫాస్టాగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, ఇక స్టిక్కర్లు మార్చక్కర్లేదు!

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

ఫాస్టాగ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది. ఇకపై బ్యాంకులు మారినా వాహనాలపై ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్లు మార్చాల్సిన అవసరం లేదు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 'వన్ ట్యాగ్' ఫీచర్‌ను ప్రారంభించారు. దీని ద్వారా రాజమార్గయాత్ర యాప్ ఉపయోగించి సులభంగా ఫాస్టాగ్‌ను వేరే బ్యాంకుకు పోర్ట్ చేసుకోవచ్చు. ఎన్పీసీఐ దీనికి టెక్ సపోర్ట్ అందిస్తుంది.