1980ల ట్రెండ్ పేరుతో సైబర్ నేరగాళ్ల భారీ మోసాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: మహబూబ్‌నగర్
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న 1980 వింటేజ్ లుక్ ఫొటో ఎడిటింగ్ క్రేజ్‌ను సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. నకిలీ ఏపీకే లింకులు, ఏఐ టూల్స్ ద్వారా యువతను ఆకర్షించి మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తూ, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తూ ప్రజలను నిండా ముంచుతున్నారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.