పెట్టుబడులపై అంకుర్ వా్రికూ కీలక హెచ్చరిక: తక్కువ సమయంలో కోటి సంపాదన అసాధ్యం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
పెట్టుబడుల ద్వారా తక్కువ సమయంలోనే కోటి రూపాయలు సంపాదించాలనే ఆలోచన చాలా సాధారణమైనదని, అది ఒక అమాయకపు కోరిక మాత్రమేనని ప్రముఖ వ్యవస్థాపకుడు అంకుర్ వా్రికూ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ, చాలా మంది పెట్టుబడిదారులు త్వరగా ధనవంతులు కావాలనే అత్యాశతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని, కాంపౌండింగ్ శక్తిని అనుభవించడానికి సమయం పడుతుందని తెలిపారు.