ఎన్నికల సంఘంపై చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

భారత ఎన్నికల సంఘం ఇటీవల ఇచ్చిన వివరణ పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈసీ తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ సంస్థల సమగ్రతను, ఉన్నతమైన విశ్వసనీయతను మరోసారి దేశానికి చాటిచెప్పాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వంటి కీలకమైన నిర్ణయాలన్నీ పూర్తి సమిష్టి చర్చల ద్వారా తీసుకున్నవేనని ఆయన వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం స్వతంత్ర ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం విచారకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.