ములుగు మల్లూరు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు
రిపోర్టర్: గోపి
స్థలం: ములుగు
ములుగు జిల్లా మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామిని మంత్రి దనసరి అనసూయ సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవరావుతో పాటు దేవాదాయ శాఖ అధికారులతో ఆమె ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ సమగ్ర అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ రూపకల్పన మరియు చేపట్టాల్సిన వివిధ పనులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె స్పష్టం చేశారు.