పోలీసుల చిత్రహింసలతోనే దివ్యతేజ మృతి: కుటుంబీకుల ఆరోపణ

రిపోర్టర్: గోపి స్థలం: ప్రకాశం

నెల్లూరు జిల్లాకు చెందిన దివ్యతేజను పోలీసులు ఐదు రోజుల పాటు నిర్బంధించి, చిత్రహింసలు పెట్టడం వల్లే మృతి చెందాడని కుటుంబీకులు, దళిత సంఘాలు ఆరోపించాయి. రేణంగివరం పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు జీజీహెచ్ వద్ద ఆందోళన చేపట్టారు. అయితే, దివ్యతేజను తాము కస్టడీలోకి తీసుకోలేదని, ఈ ఘటనతో పోలీసులకు సంబంధం లేదని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ స్పష్టం చేశారు.