టూరిజం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ చాడా వెంకటరెడ్డి డిమాండ్
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ టూరిజం కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టూరిజం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు చాడా వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో టూరిజం ఎండీ వల్లూరు క్రాంతిని కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని వారు ఈ సందర్భంగా కోరారు.