స్థానిక సంస్థల ఎన్నికలు: జనసేన తొలి జాబితా విడుదల చేసిన వైనం
రిపోర్టర్: హరి
స్థలం: మంగళగిరి
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ తమ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రెండు కార్పొరేషన్లు, పన్నెండు మున్సిపాలిటీలకు అభ్యర్ధులను ప్రకటించారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును ఖరారు చేశారు. కూటమి పొత్తులో భాగంగా మిగిలిన స్థానాలకు త్వరలోనే తదుపరి జాబితాలను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.