పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న షాదీ ముబారక్
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మహమ్మద్ ఉమర్ ఫారూఖ్ కుమార్తె వివాహానికి ప్రభుత్వం మంజూరు చేసిన లక్షా నూట పదహారు రూపాయల షాదీ ముబారక్ చెక్కును సోమవారం అధికారులు అందజేశారు. ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు ఈ చెక్కును లబ్ధిదారునికి అందించారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో అండగా నిలుస్తోందని, సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.