టెక్ ప్రేమికులకు భారీ షాక్: షావోమి 17టీ ఫోన్ ధరల పెంపు

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

భారతీయ మార్కెట్లో ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమి తన షావోమి 17టీ మోడల్ ధరలను మరోసారి పెంచినట్లు టెక్ నిపుణులు తెలిపారు. అన్ని వేరియంట్లపై ఐదు వేల రూపాయల మే ధరలను సవరించినట్లు సమాచారం వెల్లడించింది. ఎంపిక చేసిన ఆన్లైన్ స్టోర్లు మరియు అమెజాన్ వెబ్సైట్లో ఈ కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. పండగ సీజన్కు ముందు తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది.