విజయనగరం జిల్లాలో ఓటర్లకు ఊరట: అనర్హులకు మరో అవకాశం కల్పించిన ఈసీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయనగరం
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తుది జాబితాలో పేర్లు చేర్చుకునేందుకు అనర్హులుగా గుర్తించిన వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. విజయనగరం జిల్లాలో ఇటువంటి వారు మూడు వేల పన్నెండు మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి అర్హతపై మరోసారి పరిశీలన జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్.సత్తిబాబు స్పష్టం చేశారు.