నెల్లూరు పోలీసు గ్రీవెన్స్‌కు క్యూ కడుతున్న మహిళా బాధితులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మహిళల నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. అదనపు కట్న వేధింపులు, మోసాలు, గృహహింసకు సంబంధించి నెలకు సుమారు వంద మంది బాధితులు ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసు స్టేషన్లలో న్యాయం కాని కేసులు మరియు ఇతర వివాదాలకు సంబంధించి ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు అర్జీలు నేరుగా ఎస్పీ కార్యాలయానికి వస్తుండటం గమనార్హం.