రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నుంచి సంజీవని కార్యక్రమం అమలు

రిపోర్టర్: శివ స్థలం: పుట్టపర్తి

రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ రూపొందించి వైద్యసేవలను అనుసంధానించే సంజీవని కార్యక్రమానికి డిసెంబరు పదో తేదీ నుంచి ట్రయల్ రన్ నిర్వహించి, వచ్చే ఏడాది జనవరి మొదటి తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ధర్మవరంలో రెండు జిల్లాలకు సంబంధించి డెబ్బై ఒక్క ఆరోగ్య రథాలను ఆయన శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది వందల ముప్పై మూడు రథాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.