వైఎస్సార్ విగ్రహాన్ని శుభ్రం చేయించారంటూ పోలీసులను ఆశ్రయించిన తెదేపా నేత

రిపోర్టర్: విజయ్ స్థలం: ప్రకాశం

వినాయక నిమజ్జన ఊరేగింపులో భాగంగా వైఎస్సార్ విగ్రహంపై పసుపు రంగు పడిందనే నెపంతో తనతో దానిని నీటితో కడిగిపించి సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ చేశారని బాధితుడు కంచుమాటి నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైకాపా నాయకులు తనను బెదిరించి పరువుకు భంగం కలిగించారని నీటి సంఘం అధ్యక్షుడు కంచుమాటి నాగేశ్వరరావు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.