ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు: హైదరాబాద్ లో ఈ-లాటరీ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

పూరి గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్ప కార్యాలయంలో నాలుగు నియోజకవర్గాల పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల కోసం ఈ-లాటరీ ప్రక్రియను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ కోర్ ఏరియాలోని గోషామహల్, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల లబ్ధిదారులను ఈ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, హౌసింగ్ ఎండీ గౌతమ్ సహా పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.