'టెట్ క్వాలిఫై కాకుండానే టీచర్ ఉద్యోగం.. వాళ్లు అనుకున్నారు ఇష్టారీతిన ఇచ్చేశారు!': సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Amaravati

విశాఖపట్నానికి చెందిన యోగేశ్వర రావు టెట్‌లో అర్హత సాధించకపోయినా ఎస్‌జీటీ ఉద్యోగం ఎలా ఇచ్చారని వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. టెట్ క్వాలిఫై కాని వారికి జాబ్ ఎలా సాధ్యమైందని నిలదీస్తూ, ఈ తప్పును ప్రభుత్వం ఇప్పుడు ఎలా సరిదిద్దుకుంటుందో చూడాలని సజ్జల ఘాటు విమర్శలు చేశారు.