ట్యాంక్ బండ్ అటగా ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ప్రారంభం
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ట్యాంక్ బండ్ పరిసరాలకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. 69 అడుగుల భారీ విగ్రహ నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రేన్ల సాంకేతిక సమస్య కారణంగా శోభాయాత్ర కొంత ఆలస్యమైంది. లక్షలాది మంది భక్తుల నడుమ సాగే ఈ వేడుకల కోసం నగరంలో సుమారు 45 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.