ముగ్గురు కోతులు చిత్రం నుంచి ఆకట్టుకుంటున్న తిడుతున్నా కొడుతున్నా సాంగ్
రిపోర్టర్: సతీష్
స్థలం: India
కార్తీక్ గరిమెల్ల దర్శకత్వంలో వస్తున్న ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ అనే ప్రేమ గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ విడుదల చేశారు. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఎస్. సుహాస్ సంగీతం, చైతన్య, లాస్య గాత్రం ఈ పాటను వినసొంపుగా మార్చాయి. ఈ లవ్ ట్రాక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.