వినాయక మండపాల్లో విద్యుత్ ప్రమాదాలను నివారించేలా పకడ్బందీ చర్యలు
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి అర్బన్
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసే మండపాల్లో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు చోటివ్వొద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివ శంకర్ లోతేటి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు లోడ్ ఉన్న మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు. విద్యుత్ అలంకరణలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, నాణ్యమైన పరికరాలను మాత్రమే ఉపయోగించాలని నిర్వాహకులకు ఆయన సూచించారు.