కడ్తాల్లో వైభవంగా కొనసాగుతున్న సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కడ్తాల్

రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని ఎంబీఏ గార్డెన్స్లో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుంకిరెడ్డి ఆరో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఐదో రోజు విజయవంతంగా కొనసాగింది. శంకర నేత్రాలయ నిపుణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఐదు రోజుల్లో వేలాది మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందజేశారు. కంటి శుక్లాల బాధితులకు ఆపరేషన్లు కూడా విజయవంతంగా పూర్తి చేశారు.