భక్తిశ్రద్ధలతో అగనంపూడిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని అగనంపూడిలో వినాయక చవితి ఉత్సవాలు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ 79, 85 వార్డుల్లో హైదరాబాదు విగ్రహాలకు ధీటుగా వివిధ రూపాల్లో వినాయక ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ పలు మండపాలను సందర్శించి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.