రాష్ట్రంలో తీవ్రమైన ఎల్‌నినో ప్రభావం, 2.44 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి!
రిపోర్టర్: హరి
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం కావడంతో రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల్లో 2.44 లక్షల హెక్టార్లలో పంటలు ఎండుముఖం పట్టాయి. ఖరీఫ్‌లో 51% లోటు వర్షపాతం నమోదు కాగా, పత్తి, కంది, వేరుశనగ పంటలు తీవ్ర బెట్టను ఎదుర్కొంటున్నాయి. బెట్ట పరిస్థితులున్న ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ఉన్న నీటివనరులతో రక్షక తడులు అందించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.