విద్యుత్ ప్రాజెక్టుల పరిశీలనకు ఆరు బృందాలు వెళ్లనున్నాయన్న కేటీఆర్

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టుల నిజస్థితిని పరిశీలించేందుకు గురువారం నుంచి ఆరు ప్రత్యేక బృందాలు పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేటీపీఎస్, బీటీపీఎస్ ప్రాజెక్టులను వేర్వేరు బృందాలు సందర్శించి ప్లాంట్ల నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి తీరును పరిశీలిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ పరిస్థితిపై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.