ప్రేక్షకులను అలరిస్తున్న ఏమో ఏమో ఇది టైటిల్ సాంగ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

యువ హీరో రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ఏమో ఏమో ఇది సినిమా నుంచి మేకర్స్ టైటిల్ సాంగ్ను విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. అక్టోబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ తెలిపింది. మంచు కొండల అందాలతో మెలోడీ ప్రధానంగా సాగిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది అని నిర్మాతలు వెల్లడించారు.