స్నాప్ 2026 ప్రవేశ పరీక్ష మాక్ టెస్ట్ తేదీ వెల్లడి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: India
సింబయాసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ స్నాప్ 2026 ప్రవేశ పరీక్ష మాక్ టెస్ట్ తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 22లోపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 24న మాక్ పరీక్ష నిర్వహించనున్నారు. ఒక గంట పాటు జరిగే ఈ పరీక్షలో జనరల్ ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, క్వాంటెటివ్ అంశాల నుంచి నాలుగు ఆప్షన్లతో కూడిన మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.