2028 ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్టును సిద్ధం చేయాలి: శ్రీజేష్
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
భారత పురుషుల హాకీ జట్టు భవిష్యత్తుపై మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియా క్రీడల తర్వాత యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించి, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోసం బలమైన జట్టును నిర్మించాలని సూచించారు. ఆసియా విజయాలే బెంచ్‌మార్క్ కాదని, ప్రపంచ స్థాయి జట్లతో పోరాడేలా క్రీడాకారులు నిలకడైన ప్రదర్శన కనబరచాలని ఆయన స్పష్టం చేశారు.