జన్నారంలో విషాదం.. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామానికి చెందిన మొహమ్మద్ వలీయుద్దీన్ విద్యుత్ షాక్కు గురై దుర్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్, బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో పార్టీ అండగా ఉంటుందని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.