గర్భిణులకు హెచ్చరిక: వాయు కాలుష్యంతో పుట్టబోయే బిడ్డపై తీవ్ర ప్రభావం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
గర్భధారణ సమయంలో వాయు కాలుష్యం తల్లి ఆరోగ్యంతో పాటు కడుపులోని పిండం ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పర్శ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ దివ్య ఎల్ వెల్లడించారు. కాలుష్య కారకాలు ప్లాసెంటా పనితీరును దెబ్బతీసి బిడ్డకు అందాల్సిన ఆక్సిజన్‌ను తగ్గిస్తాయని తెలిపారు. దీనివల్ల ప్రీమెచ్యూర్ బర్త్, తక్కువ బరువుతో జననం వంటి సమస్యలు వస్తాయని, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.