టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్‌లో మరో రౌండ్ ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి. కృత్రిమ మేధ రంగంలో పెట్టుబడులు పెంచుతున్న నేపథ్యంలో కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా సిబ్బందిని తొలగిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే ప్రభావిత ఉద్యోగులకు లేఆఫ్ మెయిల్స్ అందాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే సుమారు 20 వేలకు పైగా ఉద్యోగులను సంస్థ తొలగించింది.