లాస్ ఏంజిల్స్లో ఘనంగా ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: లాస్ ఏంజిల్స్

అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కాన్సుల్ జనరల్ డాక్టర్ కే.జే. శ్రీనివాస తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రాచీన వైద్య విధాన ప్రాశస్త్యాన్ని చర్చించారు. ప్రజలు, భూగోళం, నివారణ ప్రధాన ఇతివృత్తంగా ఈ వేడుకలు జరిగాయని నిర్వాహకులు వెల్లడించారు. పద్మభూషణ్ డాక్టర్ డేవిడ్ ఫ్రాలీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారని వారు పేర్కొన్నారు.