జాతీయ రహదారిపై లారీ టిప్పర్ ఢీకొని క్లీనర్ మృతి
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం 26వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టిప్పర్ క్లీనర్ పడాల లక్ష్ము మృతి చెందగా, డ్రైవర్ ఎరబోలు తిరుపతిరావు తీవ్రంగా గాయపడ్డారు. బొబ్బిలి నుంచి అచ్యుతాపురం వెళ్తున్న క్వారీ రాయి టిప్పర్, ఛత్తీస్గఢ్ వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ లక్ష్ము ప్రాణాలు కోల్పోయారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.