గేమింగ్ రంగంలోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు భారీ పెట్టుబడులు
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గేమింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారని ముంబైకి చెందిన షార్ట్ గన్ గేమ్స్ సంస్థ వెల్లడించింది. ముంబైకి చెందిన ఆ సంస్థలో ఆయన వ్యూహాత్మక పెట్టుబడిదారుగా చేరారని, టేక్‌డౌన్ జెనెసిస్ పేరుతో కొత్త యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌ను అభివృద్ధి చేయనున్నారని నిర్వాహకులు తెలిపారు. సినిమాలతో పాటు వ్యాపార రంగాలపై ప్రత్యేక ఆసక్తి చూపే ఆయన ఈ కొత్త భాగస్వామ్యంతో గేమింగ్ రంగంలో తన ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.