నాందేడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

రిపోర్టర్: రాజేష్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్-భోకర్ రహదారిపై ప్యాసింజర్ వ్యానును ట్రక్కు ఎదురుగా బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.