ఏపీ టెట్ తుది ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ తుది ఫలితాలు మరియు ఫైనల్ ఆన్సర్ కీలను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో అధికారిక వెబ్ సైట్ ద్వారా స్కోర్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రాబోయే డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు అభ్యర్థులకు అత్యంత కీలకంగా మారాయి.