ఎక్కువ ధరలకు బియ్యం అమ్మితే వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతాం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జైపూర్
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జైపూర్ మండలంలో సమత రైస్ డిపో అమ్మకాల అవుట్ లెట్ ను ప్రారంభించారు. ప్రజలకు బియ్యం ధరలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత గరిష్ట ధరల కంటే ఎక్కువగా అమ్మకాలు జరపవద్దని వ్యాపారులను హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టంగా హెచ్చరించారు.