విశాఖలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

రిపోర్టర్: శివ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులుగా నిలిచిన మహిళలు తమ సొంతింటి కల నెరవేరుతుండటంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. మీ ఇల్లు - మీ హక్కు నినాదంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంతోషం వెలకట్టలేనిదని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.