ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించిన కేసీఆర్

రిపోర్టర్: సునీల్ స్థలం: Erravelli

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా వేద పండితుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధపూజ ఘనంగా చేపట్టారు. అనంతరం శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మీయంగా మాట్లాడారని పార్టీ శ్రేణులు తెలిపారు.