రోమియో జూలియట్ సినిమా కథా టీజర్ విడుదల చేసిన ప్రభాస్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా భార్గవ్ మచెర్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా 'రోమియో జూలియట్' సినిమా కథా టీజర్ను ప్రముఖ నటుడు ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రంలో నూతన కోణంలో సాగే ప్రేమ కథను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.