టైలర్ల సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి కొల్లు రవీంద్రకు వినతి
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
టైలర్ల సంక్షేమం, వృత్తిపరమైన ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు వినతి పత్రం అందజేశారు. మచిలీపట్నంలో జరిగిన ఈ భేటీలో టైలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వివరించారు. ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టైలర్ల జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆకాశపు స్వామి కోరారు. ఆయన చేస్తున్న కృషిపై టైలర్లు, ఫెడరేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.