అమెరికాలో ఘనంగా కళా ఉత్సవ్: ప్రవాస భారతీయులతో ఉట్టిపడిన సాంస్కృతిక వైభవం

రిపోర్టర్: నరేష్ స్థలం: Iowa

అమెరికాలోని ఐయోవాలో ఇండియన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో కళా ఉత్సవ్ ఘనంగా నిర్వహించినట్లు కాన్సుల్ జనరల్ ఆనంద్ ప్రకాష్ తెలిపారు. ఈ వేడుకల్లో కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్, యూఎస్ మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడంలో ప్రవాసులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆనంద్ ప్రకాష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.