రైతన్నలకు తీపి కబురు: డ్రిప్ సాగుతో బొప్పాయి పంటలో భారీ లాభాలు

రిపోర్టర్: శివ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామానికి చెందిన రైతు షేక్ గాలే సాహెబ్ రెండెకరాల్ లో బిందు సేద్యం ద్వారా బొప్పాయి సాగు చేసి యాభై టన్నుల దిగుబడి సాధించినట్లు తెలిపారు. తక్కువ నీటితో, ఆధునిక పద్ధతులు పాటిస్తూ పంట పండించడం ద్వారా పెట్టుబడి పోను రెండు లక్షల పది వేల రూపాయల నికర ఆదాయం ఆర్జించినట్లు ఆయన వివరించారు.