వ్యవసాయాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపు
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
హైదరాబాద్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, ఆదాయం పెంపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ప్రతి రైతుకూ కిసాన్ క్రెడిట్ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని, దేశమే మొదటి ప్రాధాన్యం అనే దృక్పథంతో వ్యవసాయ సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ మోడల్ రైతు సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.