'వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి': పొదలకూరు ఎస్సై స్పష్టం

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరు పరిధిలో వినాయక చవితి ఉత్సవాలకు ముందస్తుగా పోలీసు అనుమతి తీసుకోవాలని ఎస్సై శివ రాకేష్ స్పష్టం చేశారు. ఉత్సవ కమిటీలు ఉచిత సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రహదారులు, రాకపోకలకు ఆటంకం కలిగించేలా మండపాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. లౌడ్స్పీకర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే వాడాలని, డీజేలు, బాణాసంచాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు.