రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం రాత్రి తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలతో పాటు పల్నాడు జిల్లాకు నూతన ఎస్పీలను నియమించింది. మార్కాపురం ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, పోలవరం ఎస్పీగా కె.చక్రవర్తి, పల్నాడు ఎస్పీగా జగదీష్ అడహల్లిలను ప్రభుత్వం కేటాయించింది. ఈ మూడు జిల్లాలకు ఎస్పీలుగా వీరి ముగ్గురికి ఇవే తొలి పోస్టింగులు కావడం గమనార్హం.