అక్టోబర్ 1 నుంచి జనన మరణాల కొత్త నిబంధనలు అమలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: భారతదేశం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనన, మరణాల రిజిస్ట్రేషన్ సవరణ చట్టం–2026 అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఆలస్యంగా జనన, మరణాలను నమోదు చేసుకునే నిబంధనలను ఈ చట్టం మరింత కఠినతరం చేసింది. ఒక సంవత్సరం దాటిన తర్వాత రెండేళ్లలోపు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి కాగా, రెండేళ్లకు మించితే ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది.