మురసు తీవ్ర తుఫాను ముప్పు: అప్రమత్తమైన సర్కార్

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

మురసు తీవ్ర తుఫాను ముప్పు నేపథ్యంలో యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ నుంచి అధికారులతో తుపాను సన్నద్ధతపై ఆయన సమీక్షించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.