నా జీవితంలో పది శాతమే చూపించారు: బయోపిక్ పై మేరీ కోమ్ క్లారిటీ
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా తన ప్రయాణంలో కేవలం పది శాతం మాత్రమే చూపిందని బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ స్పష్టం చేశారు. నటి ప్రియాంక చోప్రా నటనను తాను ఎప్పుడూ విమర్శించలేదని, ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని పేర్కొన్నారు. తనపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ, సినిమా తన కష్టాలను పూర్తిగా చూపలేకపోయిందని, తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె తెలిపారు.