విద్యార్థులకు అలర్ట్: చెవినింగ్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు ముగింపు
రిపోర్టర్: గోపి
స్థలం: London
అంతర్జాతీయ విద్యార్థులకోసం అందించే ప్రతిష్టాత్మక చెవినింగ్ స్కాలర్షిప్ 2027-2028 దరఖాస్తు గడువు ముగిసినట్లు యూకే విద్యావర్గాలు స్పష్టం చేశాయి. అర్హత కలిగిన అభ్యర్థులకు యూకేలో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించేందుకు ఈ ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. తదుపరి ఎంపిక ప్రక్రియలో భాగంగా అక్టోబర్ నుంచి అర్హత స్క్రీనింగ్ మరియు కమిటీ అసెస్మెంట్లు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ స్కాలర్షిప్ కింద ట్యూషన్ ఫీజులు, నెలవారీ భత్యం, విమాన ఖర్చులు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు.